Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ఆత్మవిశ్వాసం స్పష్టతకు ప్రత్యామ్నాయం కాదు. విజయం సాధించాలంటే, మీకు కావాల్సింది స్పష్టత, ఆత్మవిశ్వాసం కాదు.
ఈ పౌర్ణమి రోజున, గౌతమ బుద్ధుడు సంపూర్ణ ఆత్మజ్ఞానం పొందారు, ఆపై ఓ ఆధ్యాత్మిక వెల్లువని సృష్టించారు. మీ ఆధ్యాత్మిక సాధనని మరింత తీవ్రతరం చేసుకునేందుకు ఇది మీకు స్ఫూర్తి కావాలి.
యోగా అంటే మృదువుగా మారడం – కేవలం భౌతికంగానే కాదు, అన్ని విధాలుగానూ. అంటే, మీరెక్కడున్నా, బాగానే ఉంటారు.
ఇతరులలోని ఉత్తమమైన దాన్ని వెలికి తీసుకురాగల సామర్థ్యమే మిమ్మల్ని నాయకుడిగా నిలబెడుతుంది.
అదే శక్తి లక్షలాది భిన్నమైన విధాలుగా వ్యక్తమవుతోంది: రాయిగా, చెట్టుగా, జంతువుగా, మనిషిగా, లేదా దాని అత్యంత సూక్ష్మ రూపంలో – దైవంగా.
మా అమ్మ నా వ్యక్తిగత స్వేచ్ఛకు ఎన్నడూ భంగం కలిగించకుండానే, నాకు పూర్తిగా కలుపుగోలు వాతావరణాన్ని నెలకొల్పింది. ఇది నాకు అద్భుతాలు చేసింది.
లెక్కలు వేసుకోవడంలో మనసుకి ఒత్తిడి, సంఘర్షణ ఉంటాయి. ఇవ్వడంలో ఆనందం ఉంటుంది.
A seed that does not sprout is as good as a pebble. For the divine seed that you are to flourish, you have to open up.
జీవితమంటే మీ చుట్టూ జరుగుతున్న ఒక నాటకం కాదు. జీవితం అంటే మీరే అయిన ఆ మూల తత్వం.
మనుషులుగా మనం మరింత శక్తిమంతం అవుతన్నకొద్దీ, మనం ప్రతిచర్యాత్మకంగా, నిర్బంధంగా కాకుండా మరింత సచేతనంగానూ, బాధ్యతాయుతంగానూ మారాల్సిన ప్రాధమిక అవసరం ఉంది.
కర్మ అంటే మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం. మీ కర్మను మరింత ఎరుకతో నిర్వహించుకుంటే, మీ విధికి మీరే విధాత అవుతారు.
నవ్వలేని వ్యక్తి ధ్యానం చేయలేడు. నవ్వు అంటే మీ శక్తి ఒక విధమైన ఉల్లాస స్థితిలో ఉందని. భౌతిక చర్య లేకండా మీ శక్తి అత్యంత ఉల్లాసభరితంగా మారితే అదే ధ్యానం.